NTV Telugu Site icon

TV Anchor: తీర్థంలో మత్తుమందిచ్చి రేప్.. పూజారిపై టీవీ యాంకర్ కేసు

Rape

Rape

TV Anchor Filed Rape Case on Temple Priest: చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామిపై తమిళనాడులోని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కేసు పెట్టింది. ఆమె విరుగంబాక్కం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నాకు తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన తర్వాత పూజారి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడని యాంకర్ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. సాలి గ్రామానికి చెందిన 30 ఏళ్ల దివ్య (పేరు మార్చాం). తాను ఆధ్యాత్మిక వ్యక్తినని, ఆలయాలను సందర్శిస్తూనే ఉంటానని ఫిర్యాదులో పేర్కొంది. చెన్నైలోని పర్యాస్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ కాళికంపాల్ ఆలయాన్ని నేను తరచుగా సందర్శిస్తా, ఈ సమయంలో అదే ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో తనకు స్నేహం ఏర్పడిందని ఆమె పేర్కొంది.

సాయి పల్లవి టు శ్రీ లీల : డాక్టర్ చదివిన హీరోయిన్లు వీరే

ఇద్దరి మధ్య సన్నిహిత స్నేహం ఏర్పడిన తర్వాత కార్తీక్ మునిస్వామి ఆలయంలో జరిగే విశేషాలు, ప్రత్యేక పూజల గురించి వాట్సాప్ ద్వారా సందేశాలు పంపేవాడు. స్నేహితురాలు కావడంతో దివ్య ఆలయానికి వచ్చినప్పుడల్లా కార్తీక్ మునిస్వామి ఆమెను గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం కల్పించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. రోజులు గడిచేకొద్దీ, స్నేహం పెరిగిందని పేర్కొంది. ఒకరోజు నేను గుడికి రాగా తన బెంజ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడు. కారులో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చారని, దీంతో తాగిన తర్వాత నాకు స్పృహ తప్పింది. ఆ తర్వాత నాపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కార్తీక్ మునిస్వామి గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీని తర్వాత కార్తీక్ మునిస్వామి చాలాసార్లు మా ఇంటికి వచ్చారు, ఆ తర్వాత నేను కూడా గర్భవతిని అయ్యాను. ఈ విషయం తెలిసి వడపళనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఆ తర్వాత నన్ను కూడా సెక్స్ వర్క్ చేయమని బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఫిర్యాదు మేరకు విరుగంబాక్కం మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు కార్తీక్ మునిస్వామిని అరెస్ట్ చేశారు. అంతే కాకుండా, టీవీ యాంకర్‌తో ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు మరియు వీడియోలు కూడా అతని మొబైల్ ఫోన్ నుండి రికవరీ చేయబడ్డాయి. కార్తీక్ మునిస్వామిని మొత్తం ఆరు ఐపీసీ సెక్షన్ల కింద అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత దివ్య చెన్నైకి చెందిన ఓ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది.

Show comments