Site icon NTV Telugu

Mukesh Gowda: ‘గుప్పెడంత మనసు’ హీరో రిషి ఇంట తీవ్ర విషాదం

Rishi

Rishi

Mukesh Gowda: బుల్లితెర హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముఖేష్ తండ్రి సోమవారం మృతి చెందారు. ఆయన గత్ కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ముకేశ్ షూటింగ్ ను మధ్యలోనే వదిలి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ముఖేష్ అనగానే.. చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. అదే హీరో రిషి అనండి,.. గుప్పెడంత మనసు రిషినా అంటూ టక్కున గుర్తుపట్టేస్తారు. కన్నడ నటుడుగా తెలుగు ఇండస్ట్రీలో ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా ముఖేష్ పరిచయమయ్యాడు. ఆ తరువాత గుప్పెడంత మనసు సీరియల్ తో బిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కు కుమార్ దర్శకుడు. నిత్యం ట్విస్టులతో నడుస్తున్న ఈ సీరియల్ తోనే ముఖేష్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక ఈ మధ్య టీవీ షోలలో కూడా కనిపిస్తున్న ముఖేష్ తన తండ్రిని.. కన్నకొడుకుకన్నా ఎక్కువ చూసుకునేవాడు. ఒక ఈవెంట్ లో అతను తన తండ్రిని పరిచయం చేస్తూ కన్నీరుమున్నేరు అయ్యాడు.

Dimple Hayati: తప్పు ఒప్పు పక్కన పెడితే.. పాప.. ఒక్కసారిగా ఫేమస్ అయిందిగా

“మా నాన్నని నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను.. అందరి లైఫ్‌లో జరుగుతుందో లేదో నాకు తెలియదు. బట్ నా లైఫ్‌లో జరిగింది. ఆయనకు గెడ్డం తీస్తూ.. దగ్గర ఉండి స్నానం చేయించి బట్టలు మారుస్తూ ఆయనను కన్నకొడుకులా చూసుకుంటున్నాను. అది నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో రిషి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి మరణంతో రిషి కుంగిపోయినట్లు తెలుస్తోంది. రిషిని ఓదార్చడానికి గుప్పెడంత మనసు చిత్ర బృందం మైసూర్ వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో అభిమానులు రిషి తండ్రి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

Exit mobile version