NTV Telugu Site icon

“టక్ జగదీష్” ఓటిటి వెనుక అసలు నిజాలు

న్యాచురల్ స్టార్ నాని హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎంసీఏ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించినా ఆతరువాత వచ్చిన సినిమాలు ఆశించినంతగా ఆడలేదు. అయితే నాని ఫ్యాన్ బేస్ తో వసూళ్లకు ఏమి ఢోకా లేకపోవడంతో ఆయన నిర్మాతలు ఉపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీకి సిద్ధమైంది. నాని థియేటర్ లో విడుదలకు మొగ్గు చూపిన.. నిర్మాతతో ఎన్ని చర్చలు జరిపిన ఫలించలేదని తెలుస్తోంది. ఆర్థికపరమైన విషయం కాబట్టి నాని సైతం నిర్మాత వైపే నిలబడ్డాడు. అయితే ఓటీటీకి కాంప్రమైస్ కావడానికి ఆ సినిమాకి వచ్చిన భారీ డీల్ అనే తెలుస్తోంది. టక్ జగదీష్ స్ట్రీమింగ్ కు ఏకంగా 37 కోట్లకు అమ్మడైయిందని తెలిసింది. థియేటర్లో హిట్ అయిన ఇంత వసూళ్లు వస్తాయో రావో అనుకున్న నిర్మాతలు ఓటీటీకి మొగ్గుచూపారు. సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతున్నట్లు సమాచారం. కాగా అదే రోజు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం కూడా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఓటీటీ వర్సెస్ థియేటర్ సినిమాల్లో ఏ సినిమా నిలుస్తోందో చూడాలి!

Show comments