నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా “టక్ జగదీష్”. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ రీసెంట్ గా ఈ మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్ వచ్చింది. అయితే ఇప్పుడు “టక్ జగదీష్” మేకర్స్ మూవీ డిజిటల్ విడుదలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల విడుదలైన “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు సినిమా ప్రేమికులు సినిమా హాళ్లకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. “టక్ జగదీష్” మేకర్స్ డిజిటల్ రిలీజ్ ఒప్పందాన్ని రద్దు చేయడానికి ప్రధాన కారణం అదే. “టక్ జగదీష్” విడుదల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
Read Also : రిపబ్లిక్: సాఫ్ట్ లుక్ లో జగపతిబాబు
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన “టక్ జగదీష్” చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు నటించారు. “నిన్ను కోరి” అనే సూపర్ హిట్ చిత్రం తర్వాత నాని, నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రమిది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. నాని “జగదీష్” అనే టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. కథాంశం గ్రామీణ నేపథ్యంలో కొనసాగనుంది అని ట్రైలర్ చూస్తే అర్థం అయిపోతుంది. “టక్ జగదీష్” కాకుండా నేచురల్ స్టార్ నాని చేతిలో “శ్యామ్ సింగ రాయ్”, “అంటే సుందరానికి” చిత్రాలు ఉన్నాయి.
