Site icon NTV Telugu

నాని, నాగ చైతన్య మధ్య పోటీ తప్పదా ?

Tuck Jagadish and Love Story clash

నాని, నాగ చైతన్య మధ్య పోటీ తప్పేలా కన్పించడం లేదు. నాని “టక్ జగదీష్”, నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ” ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్, లాక్డౌన్ కారణంగా రెండు సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. దీంతో కొంతకాలం వరకు ఈ రెండు సినిమాకు ఓటిటిలో నేరుగా విడుదల అవుతాయంటూ వార్తలు వచ్చాయి. కానీ “టక్ జగదీష్”, “లవ్ స్టోరీ” రెండూ థియేట్రికల్ విడుదలకే మొగ్గు చూపాయి. “లవ్ స్టోరీ” సినిమా అయితే ఎప్పటి నుంచో విడుదల గురించి ఎదురు చూస్తోంది.

Read Also : “బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ క్వారంటైన్ అప్పటి నుంచే…?

రీసెంట్ గా థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. ప్రేక్షకులు నెమ్మదిగా సినిమా థియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండు సినిమాల నిర్మాతలు డైరెక్ట్ థియేట్రికల్ విడుదలకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఒకే తేదీన రెండు సినిమాలు తలపడడానికి సిద్ధమవుతున్నాయనేది లేటెస్ట్ టాక్. సెప్టెంబర్ 10న వినాయక చతుర్థి పండుగ కానుకగా రెండు సినిమాలను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు. “టక్ జగదీష్”, “లవ్ స్టోరీ” మేకర్స్ నుంచి అయితే ఇప్పటి వరకూ కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు.

Exit mobile version