పెళ్లి అయ్యిన ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది లేడీ సూపర్ స్టార్ నయనతారకు.. నిన్న గురువారం ప్రియుడు విగ్నేష్ శివన్ తో నయన్ మూడు ముల్లు వేయించుకున్న విషయం విదితమే.. ఇక పెళ్లయిన తెల్లారే స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుపతికి వచ్చి ఇరుక్కుపోయారు నవ దంపతులు .. తిరుమల ఆచారాలను పక్కన పెట్టి నయన్ మాడ వీధుల్లో చెప్పులతో నడవడం, ఫోటో షూట్ నిషేధమని తెలిసినా ఫోటోలు దిగడంతో హిందూ వర్గాలు మండిపడ్డాయి.. యనేత సెలబ్రిటీలు అయితే మాత్రం ఇలాంటి తప్పులు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ఇక నయనతార విఘ్రేష్ శివన్ చెప్పులు వేసుకుని తిరుబమాడవీధుల్లో ఫొటో షూట్ చేయడం చెప్పులు వేసుకుని తిరగడం వంటి వీడియోలు, ఫొటోలపై తాజాగా టీటీడీ పాలక మండలి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
నిభందనలకు విరుద్దంగా మాడవీధులలో పాదరక్షలు ధరించినందుకు,ఫోటో షూట్ చేసిన నయనతార దంపతలకు నోటిసులు జారీ చేస్తున్నట్లు టీటీడి సివియస్ఓ నరసింహ కిషోర్ తెలిపారు. ఈ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎలాంటి సెక్షన్ ల కింద కేసులు నమోదు చేయవచ్చో పరిశీలిస్తున్నామని తెలిపారు. భక్తులు మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరుతతూ వీడియో రిలీజ్ చేయిస్తామని, నోటిస్ పై వారి వివరణ బట్టి తదుపరి చర్యలు వుంటాయని తెలిపారు. తప్పు చేస్తే ఎలాంటి వారిని ఉపేక్షించేది లేదని, భవిష్యత్త్ లో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకూండా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడమని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటివరకు ఈ ఘటనపై నవదంపతులు నోరువిప్పకపోవడం విశేషం..
