NTV Telugu Site icon

True Lover Trailer: ట్రూ లవర్స్.. మీకోసం ఇంకో కల్ట్ బొమ్మ

True

True

True Lover Trailer: మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ట్రూ లవర్. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ నీ మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రతి ప్రేమ జంట బయట ఎలా ఉంటారో ఈ జంట కూడా అలాగే కనిపించారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ట్రైలర్ కనిపించింది. ఆరేళ్ళ ప్రేమ.. ఎన్నో గొడవలు.. అయినా కలిసి ఉండాలనుకొనే అబ్బాయి. డబ్బు, పరపతి ఉన్న అమ్మాయి.. పెళ్ళికి మాత్రం టైమ్ అడుగుతూ ఉంటుంది. డబ్బు లేకపోతే తనకు విలువ లేదని, డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ.. ప్రేమను దూరం చేసుకున్న అబ్బాయి చివరికి తన ప్రేమను దక్కించుకున్నాడా.. ? లేదా.. ? అనేది ట్రూ లవర్ కథ. ఈ ట్రైలర్ లో హీరో కనిపించడు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి.. తనను తాను ఉహించుకుంటాడు. చదువు, ఉద్యోగం, ప్రేమ, డబ్బు.. ఒక అబ్బాయి జీవితంలో ఎందుకు ముఖ్యమో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ట్రైలర్ ను బట్టి ఈ సినిమా మంచి హైప్ ను తెచ్చుకుంటుందనిపిస్తుంది. మరి ఈ సినిమాతో చిత్ర బృందం ఎలాంటి హిట్ ను అందుకుంటారో లేదో చూడాలి.