NTV Telugu Site icon

RadheShyam: మరోసారి ప్రభాస్ పై విరుచుకుపడ్డ ట్రోలర్స్.. ఆ విషయంలో జాగ్రత్త లేదా అంటూ

prabhas

prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. తనతో పాటు ఉన్న హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నా డార్లింగ్ మాత్రం ఇంకా కెరీర్ వైపే అడుగులు వేస్తున్నాడు. హీరో నుంచి యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన వైనం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక్కడివరకు డార్లింగ్ విషయంలో పేరుపెట్టడానికి లేదు.. కానీ లుక్ విషయంలో మాత్రం ట్రోలర్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 42.. సాహో సినిమా చేసేట్టప్పుడే డార్లింగ్ లుక్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖం అంతా ముడతలు పడిపోయి కనిపిస్తుంది.. బాడీ మీద శ్రద్ద వహించడం లేదని.. సాహో ఫ్లాప్ కి ఒక కారణం డార్లింగ్ లుక్స్ కూడా ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఇక తాజగా రాధేశ్యామ్ లోనూ డార్లింగ్ లుక్ పై పలువురు పెదవి విరుస్తున్నారు.

నిజం చెప్పాలంటే రాధేశ్యామ్ షూటింగ్ ఇప్పుడు మొదలుపెట్టింది కాదు.. నాలుగేళ్ళ క్రితం స్టార్ట్ అయ్యింది. అప్పుడు కూడా డార్లింగ్ కొద్దిగా బొద్దుగానే ఉన్నాడు.. అందులోనూఫేస్ కూడా ముడతలు పడి ఏజ్డ్ గా కనిపించాడు. అయితే ఏదో ఒక విధంగా డార్లింగ్ క్లాస్ లుక్ ని మేనేజ్ చేసి వదిలారు. అది కొంచెం పర్లేదు అనిపించినా లవర్ బాయ్ లాసినిమాలో కనిపించలేకపోయాడు అనేది ఫ్యాన్స్ దాయాలనుకున్నా బయటపడుతున్న నిజం.. రాధేశ్యామ్ లోని కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ లుక్ మరీ ఘోరంగా ఉందని,వయస్సు అయిపోయినవాడిలా కనిపిస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇక డైలాగ్ డెలివరీ విషయంలో కూడా ప్రభాస్ ఆకట్టుకోలేకపోయాడని టాక్ వినిపిస్తుంది. ఇక ట్రోలింగ్ గురించి పక్కన పెట్టినా.. అందరూ ప్రభాస్ ని కోరుతున్నది ఒక్కటే.. ఇప్పటినుంచి అయినా డార్లింగ్ బాడీ మీద శ్రద్ద చూపించి అభిమానుల కోరిక తీరుస్తాడేమో చూడాలి.