Mahesh Babu: సోషల్ మీడియా వచ్చాకా.. నిజానిజాలు తెలుసుకోవడం అనేది మరుగున పడిపోయింది. ఎవరో ఏదో ఒక మాట అనడం.. దానికి సపోర్ట్ చేస్తూ ఇంకొంతమంది వచ్చేస్తారు.. వారిని ట్రోల్ చేస్తూ ఇంకొంతమంది వచ్చేస్తారు. ఆ వార్తలో నిజం ఎంత..? అబద్ధం ఎంత అనేది వారికి కూడా తెలియదు. ముఖ్యంగా గత కొంతకాలంగా స్టార్ హీరోలను ట్రోల్ చేయడానికే ఒక బ్యాచ్ ఉందా..? అన్నట్లు ఉన్నారు కొంతమంది ట్రోలర్స్. ఎవరైనా ఒక ఫేక్ న్యూస్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ఆలస్యం. దానిమీద చర్చాగోష్టిలు మొదలుపెట్టి.. మా హీరో ఇది.. మీ హీరో అది.. అంటూ అసభ్యకరమైన పదజాలంతో.. అసభ్యకరమైన మీమ్స్, ఎడిట్స్ తో కొట్టుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. హీరోల మీద నెగెటివీటిని పెంచడం గొప్పగా ఫీల్ అవుతున్నారు కొంతమంది ట్రోలర్స్. గత మూడు రోజులుగా ఎన్టీఆర్.. శతజయంతి ఉత్సవాలకు రాలేదని.. అతనిపై ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ చేశారు. ఇంకా ఆ వివాదం ముగియనే లేదు.. ఇప్పుడు మహేష్ బాబుపై నెగెటివిటిని మొదలుపెట్టారు.
Dimple Hayati Row: డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారు.. డీసీపీ ఆమెతో రాష్‌గా మాట్లాడారు
మహేష్ బాబు సుఖానికి అలవాటు పడ్డాడని, ఆయన షూటింగ్ లో చాలా కంఫర్ట్ గా ఉంటాడని, అస్సలు కాలు కూడా కదపకుండా అన్ని తనవద్దకు తెప్పించుకుంటాడని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మహర్షి సినిమాలో గేదెల వద్దకు వెళ్లే సీన్ షూటింగ్ సమయంలో ఎండలో తాను వెళ్ళలేనని మహేష్ చెప్పడంతో.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి .. ఏసీలోనే గేదె షెడ్ వేయించినట్లు ఆ వార్తలో రాసుకొచ్చారు. అయితే అది రాసింది ఎవరు..? ఏంటి..? అందులో నిజం ఎంత..? అబద్ధం ఎంత అనేది కూడా పట్టించుకోకుండా మహేష్ బాబు సుఖానికి అలవాటు పడ్డాడు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మహేష్ బాబు అస్సలు షూటింగ్ లో కష్టపడడు అని, రాజమౌళి సినిమాలో కూడా అంతా గ్రాఫిక్స్ కాబట్టి మహేష్ కు పని లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఒక హీరో.. సినిమా కోసం ఎంత కష్టపడేది ఇక్కడ ట్రోల్ల్స్ చేసేవారికి ఎలా తెలుసు అని మహేష్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. టక్కరి దొంగ, పోకిరి, అతడు, ఖలేజా, సర్కారు వారి పాట.. ఈ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ కోసం మహేష్ చాలాసార్లు దెబ్బలు తిన్నాడు. రోప్.. డూప్ లేకుండా చేసిన రోజులు ఉన్నాయి. వాటికి సాక్ష్యం అక్కడ పనిచేసిన నటీనటులే.. వారే ఎన్నో ఇంటర్వ్యూల్లో మహేష్ గొడ్డు చాకిరీ చేస్తాడు అని చెప్పుకొచ్చారు. అంత కష్టపడే హీరోను.. సుఖానికి అలవాటు పడ్డాడు అని ఎలా అంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ టార్చర్ పెట్టాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు
నిజం చెప్పాలంటే మహేష్ ఒక్కడే కాదు.. ఏ హీరో అయినా ఒక సినిమా కోసం.. ఎంతో కష్టపడతాడు. రాత్రి, పగలు.. ఎండ, చలి అని తేడాలేకుండా బాడీ కోసం శ్రమించి యాక్షన్ సీక్వెన్స్ లో గాయాలు అయినా పట్టించుకోకుండా.. హెల్త్ ఖరాబు అయినా లెక్కచేయకుండా అవుట్ ఫుట్ బాగా వస్తే చాలు.. ప్రేక్షకులను మెప్పిస్తే చాలు అని.. అనుకుంటారు. ఒక సెట్ లో గాయం కావడం వలన ఇప్పటికీ చాలామంది హీరోలు.. ఆ ఎఫెక్ట్ ను మోస్తున్నారు. ఏ హీరో కష్టాన్ని తక్కువ అంచనా వేయకూడదు. తీసుకొనే డబ్బుకు వారు పడే కష్టం అంతాఇంతా కాదని అందరి హీరోల అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి నిందలు వేయకుండా నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తున్నారు.