Site icon NTV Telugu

Trivikram-Sunil : ఒకే రోజున పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్-సునీల్

Trivkram

Trivkram

తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కెరీర్ ప్రారంభం నుండి ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. విశేషమేమిటంటే, వీరిద్దరూ 2002 అక్టోబర్ 11వ తేదీనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ హాస్య నటుడు సునీల్ వివాహం ‘శృతి’తో 2002 అక్టోబర్ 11న అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటల 28 నిమిషాలకు సుముహూర్తాన వీరి వివాహ వేడుక నిర్వహించబడింది. ఈ శుభకార్యానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Maoists Free State : అతిత్వరలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ.. మిగిలింది వీళ్లే..!

అయితే.. అదే రోజున ‘నువ్వే-నువ్వే’ చిత్రంతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వివాహం కూడా జరిగింది. ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమార్తె ‘సాయి సౌజన్య’తో త్రివిక్రమ్ వివాహం నిశ్చయమైంది. 2002 అక్టోబర్ 11న హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో వీరి వివాహ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఒకే తేదీన తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన ఈ ప్రాణ స్నేహితులు, అప్పటి నుండి అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.

ఎలుకల బెడదతో విసిగిపోయారా? ఇల్లు తుడిచే నీటిలో ఇది కలిపితే చాలు.. చిటికెలో మాయం!

Exit mobile version