Site icon NTV Telugu

ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా త్రివిక్రమ్

Trivikram Srinivas

Trivikram Srinivas

సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రమోషన్లో వేగం పెంచిన చిత్రబృందం రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసింది. ఆసక్తికరమైన కథ కథనంతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా వుంది. ఎస్ దర్శన్‌కు మొదటి సినిమా అయినప్పటికీ అన్ని కమర్షియల్ అంశాలతో తెరక్కించాడని అంటున్నారు. కాగా, నేడు సాయంత్రం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుఅవుతున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో సుశాంత్-త్రివిక్రమ్ కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించగా.. సుశాంత్ కూడా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ తోనే త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారు. రవిశంకర్ శాస్త్రి – ఏక్తా శాస్త్రి – హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని AI స్టూడియోస్ & శాస్త్రా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక.. వెన్నెల కిషోర్ , ప్రియదర్శి, అభనవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version