ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా త్రివిక్రమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రమోషన్లో వేగం పెంచిన చిత్రబృందం రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసింది. ఆసక్తికరమైన కథ కథనంతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా వుంది. ఎస్ దర్శన్‌కు మొదటి సినిమా అయినప్పటికీ అన్ని కమర్షియల్ అంశాలతో తెరక్కించాడని అంటున్నారు. కాగా, నేడు సాయంత్రం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుఅవుతున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో సుశాంత్-త్రివిక్రమ్ కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించగా.. సుశాంత్ కూడా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ తోనే త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కు హాజరవుతున్నారు. రవిశంకర్ శాస్త్రి – ఏక్తా శాస్త్రి – హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని AI స్టూడియోస్ & శాస్త్రా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక.. వెన్నెల కిషోర్ , ప్రియదర్శి, అభనవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
- Ntv Exclusive: 'పెద్ది'తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
- PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
తాజావార్తలు
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
-
T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
-
Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
-
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!