ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చిన “భీమ్లా నాయక్” ఎఫెక్ట్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ జోరును చూసి మేకర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుండడంతో తాజాగా “భీమ్లా నాయక్” సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్, తమన్, దర్శకుడు సాగర్ కే చంద్ర, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, సంయుక్త మీనన్, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ 80, 90లలో నటీనటుల కంటే ఈ జెనరేషన్ నటీనటులు బాగా ఎదిగిపోయారని స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు కొందరికి బాధ కలగొచ్చని అంటూనే క్షమించమని కోరారు.
Read Also : Bheemla Nayak Success Press Meet : సినిమాలో త్రివిక్రమ్ హ్యాండ్… తేల్చేసిన డైరెక్టర్
“గత ఆరేళ్ళ నుంచి చూస్తున్నాను ఈ తరం నటీనటులు డైలాగులు, లుక్స్ పరంగానే కాకుండా 24 క్రాఫ్ట్స్ పై కూడా మంచి పరిజ్ఞానాన్ని సంపాదిస్తున్నారు” అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక సెట్స్ లో దర్శకుడు సాగర్ కే చంద్రతో ఎదురైనా పరిస్థితులపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడారో ఈ వీడియోలో వీక్షించండి.