Site icon NTV Telugu

Tripti Dimri Spirit : ఒక్క పోస్టర్’కే తృప్తిని ఆడేసుకుంటున్నారుగా !

Spirit First Look

Spirit First Look

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ చిత్రం తృప్తి దిమ్రి కెరీర్‌ను మలుపు తిప్పిందన్న మాట వాస్తవం. అయితే, అదే సమయంలో ఆ సినిమాలోని బోల్డ్ సీన్స్, మరియు ఆమె పాత్రపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పాత్రను పక్కన పెట్టి, కేవలం ఆమెను మాత్రమే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’లో కూడా తృప్తి ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అభిమానుల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. నిజానికి సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో పాత్రలు చాలా రా’గా, బోల్డ్’గా ఉంటాయి. ఒకవేళ ‘స్పిరిట్’లో కూడా కేవలం షాక్ వాల్యూ కోసమో లేదా న్యూడిటీ చుట్టూ తిరిగే సీన్స్ ఉంటే, మళ్ళీ ఆ నెగెటివిటీ అంతా తృప్తి దిమ్రి మీద పడే అవకాశం ఉంది.

Also Read :Sahakutumbanam Review: సఃకుటుంబానాం రివ్యూ

నిజానికి సినిమాలో పాత్రలను డిజైన్ చేసేది దర్శకుడు, కథను రాసేది రచయిత. కానీ, తెరపై కనిపించే నటీమణులు మాత్రం ఆ పాత్రల వల్ల వచ్చే విమర్శలను వ్యక్తిగతంగా ఎదుర్కోవాల్సి రావడం వారికి కొంచెం బాధాకరమే. యానిమల్ తర్వాత తృప్తికి బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ, ‘స్పిరిట్’ లాంటి భారీ ప్రాజెక్టులో మళ్ళీ అదే తరహా పాత్రను పోషిస్తే, ఆమెకు కేవలం ‘బోల్డ్ బ్యూటీ’ అనే ముద్ర పడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న తృప్తికి, ఇలాంటి నెగెటివ్ ఇమేజ్ కెరీర్ పరంగా అడ్డంకిగా మారవచ్చు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలో నటించడం ఆమెకు ప్లస్ పాయింటే అయినప్పటికీ, పాత్ర విషయంలో తృప్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో వేచి చూడాలి.

Exit mobile version