NTV Telugu Site icon

Tripti Dimri: ఈ కొత్త క్రష్షు ఎన్టీఆర్ మీద కన్నేసిందే!

Tripti Dimri Jr Ntr

Tripti Dimri Jr Ntr

Tripti Dimri expresses her desire to work with Jr NTR among South Indian actors: యానిమల్ సినిమాతో యంగ్ బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి జాతకం ఓవర్ నైట్ మారిపోయింది. ఆమె గతంలో కూడా పలు సినిమాల్లో నటించింది కానీ ఈ సినిమాతో మాత్రం ఆమె ఒక్కదెబ్బకి ఫుల్ పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రష్మిక అయినా కనిపించింది కాసేపే అయినా తృప్తికి మాత్రం బాగా పేరొచ్చింది. హీరో రణ్‍బీర్ కపూర్‌తో తృప్తి డిమ్రి చేసిన ఇంటిమేట్ సీన్లు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ముఖ్యంగా తృప్తి అందం, నటన చాలా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో నేషనల్ క్రష్ రష్మికను పక్కన పెట్టి ఈ భామే కొత్త క్రష్ అంటూ తృప్తికి పేరు పెట్టేశారు. ఇక తాజాగా ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒక బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు కలిసి నటించాలని ఉందని కామెంట్ చేసింది.

Thalaivar 170: వేటగాడు గా వస్తున్న రజినీ.. ఈ ఏజ్ లో కూడా ఆ స్టైల్ ఏంటి తలైవా

అంటే సౌత్ లో ఏ హీరోతో నటించాలని ఉంది అని అడిగితే ఆమె ఈమేరకు కామెంట్ చేసింది. ఇక ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్స్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన తృప్తి నటించనుందని టాక్ కూడా నడుస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” అనే మూవీ వస్తోన్న క్రమంలో యానిమల్ సెన్సేషన్ హిట్ తర్వాత ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో తృప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాలుల్ ఎంతమేరకు ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి మరి.