Site icon NTV Telugu

Trikala : యాలో ఈ గుబులే ఏలో అంటున్న మహేంద్రన్

Trikala

Trikala

అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్ తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ … ఇప్పుడు మైథలాజికల్ జానర్ లో రూపొందుతున్న ‘త్రికాల’ సినిమా మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం నుంచి తాజాగా యాలో ఈ గుబులే ఎలో పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో హర్షవర్దన్ రామేశ్వర్ స్టైల్‌తో పాటు మెలడీకి ఉన్న డెప్త్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఆయన మ్యూజిక్ ట్రీట్ ఈ పాటకి ప్రధాన బలం. ప్రతి బీట్‌లోనూ ఆయన ట్రేడ్‌మార్క్ ఇంటెన్సిటీ స్పష్టంగా వినిపిస్తూ, పాటకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇచ్చింది.

Also Read :Lokayukta court: మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణ..! లోకాయుక్త కోర్టు సీరియస్

ఇక అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకి ప్రాణం పోసింది అని చెప్పాలి. భావోద్వేగాల్ని సూటిగా హృదయానికి చేరేలా చెప్పగల ఆయన వాయిస్, పాటలోని లవ్ ఫీలింగ్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. సాఫ్ట్ టచ్‌తో పాటు పవర్ ఉన్న వాయిస్ మాడ్యులేషన్‌తో అనురాగ్ మరోసారి తన వెర్సటిలిటీని నిరూపించాడు. రాకేందు మౌళి లిరిక్స్ క్యాచిగా వున్నాయి. మొత్తానికి ‘యాలో ఈ గుబులే ఎలో’ పాట హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ బ్రిలియన్స్‌కి, అనురాగ్ కులకర్ణి ఎమోషనల్ సింగింగ్‌కి పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా నిలుస్తోంది. ‘త్రికాల’ సినిమా ఆల్బమ్‌పై అంచనాలను మరింత పెంచేలా ఈ పాట ప్రత్యేకంగా నిలిచింది. సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రాఫీ సాంగ్ కి మరింత వైబ్ తీసుకొచ్చింది. రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

Exit mobile version