NTV Telugu Site icon

Jr . NTR : ట్రెండింగ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్..!

Korataly

Korataly

మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు.. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులైతే.. హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ అంటూ.. ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అంతకు ముందే.. వస్తున్నా అంటూ.. ఫ్యాన్స్‌లో ధైర్యం నింపేలా కొరటాల ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్టేట్ ఇచ్చారు తారక్. దాంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన జూనియర్ ఎన్టీఆరే కనిపిస్తున్నాడు. వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా.. ఇలా సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ పేరుతో మార్మోగిపోతోంది. అంతేకాదు.. తమ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. ఈ నేపథ్యంలో.. అర్థరాత్రే కొందరు అభిమానులు తారక్ ఇంటివద్దకు చేరుకొని.. బాణాసంచ కాల్చి హడావుడి చేశారు. మాస్ హీరో.. మాస్ ఫ్యాన్స్.. మాస్ సెలబ్రేషన్స్ అంటూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు.

ఇక టీనేజ్‌లోనే ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు. కేవలం 19 ఏళ్ల వయసులోనే స్టార్ డమ్‌ను అందుకున్న యంగ్ టైగర్.. ఆ తర్వాత తన సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసిన జూనియర్.. నిన్ను చూడాలని మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్‌తో ఫస్ట్ హిట్ అందుకొని.. నిన్నటి ట్రిపుల్ ఆర్ వరకు.. అంతకు మించి అనేలా ఎన్టీఆర్ స్టార్‌డమ్ మరింత పీక్స్‌కి చేరింది. ఇటీవల జరిపిన ఓ సర్వేలో 2022 సంవత్సరానికి గాను.. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో నిలవడమే ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక్క ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా తారక్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేటితరం హీరోల్లో మల్టీ టాలెంటెడ్ హీరో ఎవరంటే.. ఠక్కున ఎన్టీఆర్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌కి చాలా మంది స్నేహితులు ఉన్నారు.. కానీ ఆయన రామ్ చరణ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. దాంతో సోషల్ మీడియా ద్వారా స్పెషల్ ఫోటో తో స్పెషల్ విషెస్ తెలిపాడు చరణ్. ఈ సందర్భంగా.. సోదరుడు, సహ నటుడు, స్నేహితుడు.. ఈ పదాలు తారక్‌ను నిర్వచించగలవని నేను అనుకోను అంటూ.. బర్త్‌డే విష్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదేమైనా.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఎనీ వే.. ఎన్టీవి తరపున హ్యాపీ బర్త్ డే తారక్..!

బిగ్ అప్టేట్.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్.. ఊర మాస్ లుక్..!

ఫ్యాన్స్‌ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ.. తన బర్త్ డే సందర్భంగా బిగ్ అప్టేట్ ఇచ్చాడు ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి.. ఫ్యూరి ఆఫ్ ఎన్టీఆర్ 30 అంటూ.. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో మోషన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్‌తో సాగిన ఈ వీడియో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూదని… అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని… వస్తున్నా” అంటూ.. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ కల్గించేదిగా ఉంది. ఈ డైలాగ్స్‌ లో కొరటాల మార్క్ స్పష్టంగా కనిపించింది. ఈ డైలాగ్‌ను ఒక్క మ‌ల‌యాళంలో తప్పా తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లోను అదే విధంగా చెప్పాడు తారక్. దాంతో మిగతా భాష‌ల్లో కూడా ఎన్టీఆర్ ప‌ర్ఫెక్ట్‌గా డైలాగ్స్ చెప్పడం పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

ఇక ఎన్టీఆర్ 30 అప్టేట్ ఇలా ఉంటే.. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ కూడా అదే రేంజ్‌లో ఉంది. కొరటాల శివతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా బిగ్ అప్టేట్ ఇస్తూ.. ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 𝑻𝒉𝒆 𝒐𝒏𝒍𝒚 𝒔𝒐𝒊𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒘𝒐𝒓𝒕𝒉 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓𝒊𝒏𝒈 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒔𝒐𝒂𝒌𝒆𝒅 𝒊𝒏 𝒃𝒍𝒐𝒐𝒅..! 𝐇𝐢𝐬 𝐬𝐨𝐢𝐥.. 𝐇𝐢𝐬 𝐫𝐞𝐢𝐠𝐧 .. 𝐁𝐮𝐭 𝐝𝐞𝐟𝐢𝐧𝐢𝐭𝐞𝐥𝐲 𝐧𝐨𝐭 𝐡𝐢𝐬 𝐛𝐥𝐨𝐨𝐝.. అంటూ.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్.. భారీ గడ్డంతో.. చాలా క్రూరంగా.. ఊర మాస్ లుక్‌లో కనిపిస్తు.. కంటిచూపుతోనే భయపెడుతున్నారు. దాంతో ప్రశాంత్ నీల్ స్టైల్లో.. కెజియఫ్, సలార్ తరహాలోనే.. ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోందని చెప్పొచ్చు. ఇక ఈ డార్క్ షేడ్ భీకర లుక్ చూసిన తర్వాత.. ఎన్టీఆర్‌ కొత్తగా ఉన్నారంటూ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ప్రభాస్ ‘సలార్’ అయిపోయిన వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఏదేమైనా బ్యాక్ టు బ్యాక్ అప్టేట్స్ ఇవ్వడంతో.. నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు.