Site icon NTV Telugu

ATM: రూ. 25 కోట్లు దోచుకున్న నలుగురు కుర్రాళ్ళు!

Atm

Atm

Sunny: టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘ఏటీఎం’. ఈ వెబ్ సీరిస్ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. ‘దిల్’ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సి. చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మేకర్స్ ఇటీవల విడుద‌ల చేశారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ వీజే సన్నీ ఇందులో కీలక పాత్ర పోషించాడు. జ‌గ‌న్ (బిగ్ బాస్ తెలుగు విజేత వి. జె. స‌న్నీ), పోలీస్ ఆఫీస‌ర్ హెగ్డే (సుబ్బ‌రాజ్ ) మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ‘ఏటీఎం’. దోపిడి ప్ర‌ధానంగా సాగే ఈ యాక్ష‌న్ క్రైమ్ డ్రామాలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్‌, రా ఎలిమెంట్స్ అన్నీ మిళిత‌మై ఉన్నాయి. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే జ‌గ‌న్ పాత్ర‌ధారి మ‌నిషి ఎద‌గ‌డానికి స‌రైన మార్గం, త‌ప్పుడు మార్గాల గురించి మాట్లాడుతాడు. అత‌డు ద‌ర్జాగా, విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌టానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నాడనేదే క‌థాంశం. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో దీన్ని ఎంగేజింగ్‌గా తెర‌కెక్కించారు.

ఇందులో న‌లుగురు కుర్రాళ్లు రూ. 25 కోట్ల‌ను దోపిడి చేస్తారు. దాని చుట్లూ పొలిటిక‌ల్ కుట్ర ర‌న్ అవుతుంది. మ‌రి దీన్ని పోలీసులు ఎలా ఛేదించారు అనే పాయింట్ చుట్టూ కథ సాగుతుంది. ట్రైలర్ గమనిస్తే ఆ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఆ దోపిడి త‌ర్వాత మ‌నుగ‌డ కోసం చేసే పోరాటం అర్థమవుతుంది. ట్రైల‌ర్‌లోని అంశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. వీజే స‌న్నీ, కృష్ణ‌, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ,, దివి, సుబ్బరాజు, పృథ్వీ, దివ్యవాణి, దయానంద్ రెడ్డి, రోహిణి నాయుడు, షఫీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దీనికి ప్ర‌శాంత్ ఆర్‌. విహారి సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సిరీస్‌ను హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించారు. విజయ్ ముత్యం, సి.పి. ఇమ్మాన్యుయేల్ ఈ వెబ్ సీరిస్ కు సంభాషణలు సమకూర్చగా, సీనియర్ జర్నలిస్ట్ ఫణి ఎడిషనల్ స్క్రీన్ ప్లేను అందించారు.

Exit mobile version