Site icon NTV Telugu

‘రిపబ్లిక్’కు రేవంత్ రెడ్డి ఫిదా

TPCC Chief Revanth Reddy and MLA Seethakka appreciate Republic Movie

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ డ్రామా ‘రిపబ్లిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు అభిమానులతో పాటు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. తేజ్ నటన, దర్శకుడు దేవ కట్టా ఆలోచనాత్మక డైలాగ్స్, ‘రిపబ్లిక్’ ద్వారా ఆయన అందించిన ముఖ్యమైన సోషల్ మెసేజ్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు సినీ, రాజకీయ వర్గాల ప్రముఖులు కూడా సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్న టీడీపీ జాతీయ ప్రతినిధి నారా లోకేష్ ‘రిపబ్లిక్’ బాగుందంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఆ జాబితాలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరిపోయారు.

Read also : “ఆర్ఆర్ఆర్” కోసం ఆ పని కంప్లీట్ చేసిన స్టార్స్

నిన్న సాయంత్రం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఏఎంబి సినిమాస్‌లో ‘రిపబ్లిక్‌’ ప్రత్యేక స్క్రీనింగ్‌లో వీక్షించారు. రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరూ సినిమా చూసి చిత్ర బృందాన్ని ప్రశంసించారు. స్క్రీనింగ్‌లో డైరెక్టర్ దేవ కట్టా, గాయని స్మిత కూడా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్‌’ను జె భగవాన్, పుల్లారావు నిర్మించారు.

Exit mobile version