Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్

Toxic

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించింది. ఈ భారీ యాక్షన్ డ్రామా రిలీజ్ మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అందుకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా భారీగా టికెట్స్ సేల్స్ జరుగుతున్నాయి. అయితే నైజాంలో ఈ సినిమా బుకింగ్స్ లో తర్జన భర్జనలు జరుగుతుండగా తాజాగా నైజాం ప్రాంతంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన అధికారిక జీవో విడుదలైంది.

ఈ జీవో ప్రకారం, సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలతో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ లో రూ. 50 అలాగే మల్టిప్లెక్స్ లో రూ 100 పెంచుతూ జీవో జారీ చేసారు. దాంతో నైజాం పరిధిలోని థియేటర్ల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ రూ.  227, మల్టీప్లెక్స్‌లు రూ. 395 అయ్యాయి. జీవో వెలువడటంతో నైజాం వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ‘బుక్ మై షో’  ‘డిస్ట్రిక్ట్ ఇండియా’ లలో ప్రారంభం అయ్యాయి. యష్ అభిమానులు ఈ బిగ్ అప్‌డేట్‌తో పండగ చేసుకుంటున్నారు. కెజిఎఫ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యష్ నటించిన సినిమా కావడంతో భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్టే కన్నడ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి.