Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaka vs House No 47: సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సినిమాలపై ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. వీరిద్దరి తాజా చిత్రాలు ‘కాకా’, ‘హౌస్ నంబర్ 47’లోనూ ఒకే తరహా ఫార్ములా కనిపిస్తోందనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొదట్లో సాఫ్ట్ క్యారెక్టర్లుగా కనిపించే హీరోలు.. కథలో కీలక దశలో మాస్ అవతారంలోకి మారడం ఈ రెండు సినిమాల్లోనూ కనిపించే కామన్ పాయింట్‌గా మారిందని చర్చించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్, యాక్షన్, పవర్ఫుల్ పాత్రలు గుర్తుకొస్తాయి. అయితే ‘కాకా’లో మాత్రం ఆయనకు ఇప్పటి వరకు ఉన్న ఇమెజ్కి పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఓ ఆక్వా ఫ్యాక్టరీ సూపర్వైజర్గా చాలా సింపుల్‌గా కనిపించే చిరంజీవి.. టీజర్ చివర్లో గన్స్, యాక్షన్‌కు సంబంధించిన విజువల్స్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. దీంతో ‘కాకా’ నిజంగానే పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనరా? లేక సాఫ్ట్ క్యారెక్టర్ వెనుక భారీ మాస్ ఫ్లాష్‌బ్యాక్ దాగి ఉందా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. గతంలోనూ పలువురు హీరోల సినిమాల్లో ఇదే తరహా ఫార్ములా కనిపించింది. సాఫ్ట్‌గా కనిపించే హీరోకు ఓ మాస్ గతాన్ని జోడించి కథలో ట్విస్ట్ ఇవ్వడం కొత్తేమీ కాదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇక విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘హౌస్ నంబర్ 47’ విషయంలోనూ ఇదే తరహా చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించనున్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సన్నివేశాలు, కామెడీ, రిలేషన్స్, ఎమోషన్స్‌తో కథ సాగుతున్నట్లు కనిపిస్తున్న.. టైటిల్లోనే ‘AK47’ అనే మాస్ ఎలిమెంట్ ఉండటంతో.. ఫ్యామిలీ డ్రామా మధ్యలో క్రైమ్, యాక్షన్ ఎపిసోడ్ తప్పదనే హింట్ వస్తోంది. అయితే ఇలాంటి ఫార్ములాను ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు. మొదట సాఫ్ట్ క్యారెక్టర్‌ను చూపించి.. ఆ తర్వాత హీరో అసలు మాస్ షేడ్‌ను బయటపెట్టడం వల్ల ట్విస్ట్ ముందుగానే ఊహించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టైటిల్లోనే ‘AK47’ వంటి యాక్షన్ ఎలిమెంట్‌ను ప్రస్తావించడం వల్ల కథలోని సర్ప్రైజ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘కాకా’, ‘హౌస్ నంబర్ 47’ సినిమాల విషయంలో ఈ పాత ఫార్ములాకు డైరెక్టర్స్ ఎలాంటి కొత్త ట్రీట్మెంట్ ఇస్తారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. సీనియర్ హీరోల ఇమేజ్‌కు సాఫ్ట్ క్యారెక్టర్‌తో పాటు మాస్ ఫ్లాష్‌బ్యాక్‌ను జోడించడం సేఫ్ ఫార్ములానే అయినా.. ప్రస్తుతం ప్రేక్షకులు ఆ ట్విస్టులను చాలా త్వరగా అంచనా వేస్తున్నారు. కాబట్టి కథనం, ట్రీట్మెంట్లో కొత్తదనం ఉంటేనే ఈ ఫార్ములా మరోసారి బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందని సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!