Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు

  • యష్ మాస్ క్రేజ్‌తో బాక్సాఫీస్‌పై టాక్సిక్ దాడి
  • తొలి రోజే భారీ వసూళ్లతో కొత్త రికార్డులు
  • యాక్షన్ విజువల్స్‌తో థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్
  • కేజీఎఫ్ తర్వాత యష్ మార్కెట్ సత్తా ఇదే
Toxic

Toxic

Toxic First Day Collection: రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రం థియేటర్లలోకి అడుగుపెడుతూనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.150 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి, గ్రాండ్ ఓపెనింగ్‌తో రికార్డులను తిరగరాసింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వస్తున్న విశేష ఆదరణతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మైండ్-బ్లోయింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ స్థాయిని, మార్కెట్ సత్తాను ఈ అద్భుతమైన వసూళ్లు మరోసారి నిరూపించాయి.

యష్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ – థియేటర్లలో యాక్షన్ విజువల్ ఫీస్ట్

దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో యష్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కనబరిచిన మాస్ స్వాగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చిత్రంలోని భారీ నిర్మాణ విలువలు, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకుల గుండెల్లో గట్టిగా నాటుకున్నాయి. పవర్‌ఫుల్ విజువల్స్ , కథా నేపథ్యం విశేషంగా ఆకట్టుకోవడంతో, విడుదలైన ప్రతి మార్కెట్‌లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ‘టాక్సిక్’ రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన మైలురాళ్లను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.