Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ చర్చకు దారితీసింది. సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ విజువల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీజర్, గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాలీవుడ్ తరహా హింస, బోల్డ్ రొమాన్స్‌ను చూపిస్తున్నారంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను పట్టించుకోకుండా చిత్ర బృందం వరుసగా ప్రమోషనల్ కంటెంట్‌ను రిలీజ్ చేస్తోంది.
ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోల్లో యశ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్, అనంతరం వచ్చిన టీజర్, అలాగే పాటల్లోని కొన్ని రొమాంటిక్, ఇంటిమేట్ విజువల్స్ ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన హింసాత్మక షాట్లు, అలాగే కియారా అద్వానీతో వచ్చిన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లతో సంబంధించిన పాటలు రిలీజ్ కాగా, మిగిలిన పాటలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జన నాయగన్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టాక్సిక్ సాధారణ సినిమా కాదు. ఇది పూర్తిగా పెద్దల కోసం తెరకెక్కించిన కల్పిత కథ. ప్రేక్షకులు ఈ సినిమాను ఆ కోణంలో చూస్తే తప్పకుండా ఆస్వాదిస్తారు’ అని స్పష్టం చేశారు. అలాగే సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు దీనిని ప్రత్యేకమైన చిత్రంగా అభినందిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత కామెంట్స్‌తో ఈ సినిమాపై జరుగుతున్న చర్చకు మరింత ఊపు వచ్చింది. స్కై హై అంచనాల మధ్య ఉన్న ‘టాక్సిక్’ మూవీకి ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా? అనే టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో.
Also Read
- Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
- Mani Ratnam: సెట్స్‌పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
- Varun Tej: రిలీజ్‌కు ముందే వరుణ్ తేజ్ జాక్‌పాట్.. 'కొరియన్ కనకరాజు' రూ.26 కోట్ల బిజినెస్?
- Srinivasa Mangapuram: 'శ్రీనివాస మంగాపురం'కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం!
తాజావార్తలు
-
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
-
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
-
UK: లండన్‌లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
-
CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
-
CM Revanth Reddy : జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!