NTV Telugu Site icon

‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సూపర్ హీరో

rrr

rrr

‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా, తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ లు అతిధులుగా విచ్చేశారు.

ఇక తాజాగా నేడు కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండగా.. ఈ ఈవెంట్ కి మలయాళ హీరో టోవినో థామస్ అతిథిగా హాజరయ్యారు. ఇటీవలే టోవినో మిన్నల్ మురళి చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. లోకల్ సూపర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏది ఏమైనా ప్రమోషనలయందు జక్కన్న ప్రమోషనలు వేరయా.. అని ఊరికే అనరు.. తమ హీరోల ఫ్యాన్స్ తో పాటు అక్కడి హీరోల ఫ్యాన్స్ ని కూడా రాబట్టుకోవడానికి జక్కన్న వేసిన ప్లాన్ సూపర్ అంటూ అభిమానులు అభినందిస్తున్నారు.