పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా ఎస్. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్లందరను రంగంలోకి దింపారు మేకర్స్. ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మిగతా భాషల్లో కూడా స్టార్లను రంగంలోకి దింపారు మేకర్స్.
తెలుగు వెర్షన్ లో దర్శక ధీరుడు రాజమౌళి తన గాత్రాన్ని అందిస్తుండగా.. కన్నడ వెర్షన్ కి శివ రాజ్ కుమార్. మలయాళ వెర్షన్ కి పృథ్విరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ రాధేశ్యామ్ కోసం తమ గాత్రాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభాస్ కోసమే వీరందరూ వాయిస్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తమిళ్ వెర్షన్ కి ఏ స్టార్ వాయిస్ ఇవ్వబోతున్నాడో చూడాలి.
