Site icon NTV Telugu

KGF Chapter 2 : అతనికి అడ్డు నిలబడకండి… “తూఫాన్” వచ్చేసింది !

కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 నుండి “తూఫాన్” అనే మొదటి లిరికల్ పాట ఎట్టకేలకు విడుదలైంది. ఫస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ఈ సాంగ్ లో ప్రతి బిట్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా, శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కాండిన్య తదితరులు పాడిన ఈ పాట కథానాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ అని చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చాలా బాగుంది. ఇక ఈ సాంగ్ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైంది.

Read Also : RRR : గోల్డెన్ టెంపుల్ సన్నిధిలో టీం… పిక్ వైరల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ బహుభాషా చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. హోంబాలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించింది.

https://www.youtube.com/watch?v=xUe3eR0n380
Exit mobile version