NTV Telugu Site icon

Raj Tarun Lover Lavanya: రాజ్‌తరుణ్‌కు చాలా మందితో ఎఫైర్స్‌.. లావణ్య షాకింగ్‌ కామెంట్స్!

Lavanya

Lavanya

Raj Tarun Lover Lavanya: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. మీడియా ముందుకు వచ్చి లావణ్య మాట్లాడారు. తనను పెళ్లి చేసుకుని.. 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉండి.. నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని.. అందుకు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణమని ఆమె ఆరోపించారు. మల్హోత్రా, ఆమె సోదరుడు నుంచి తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. చంపి.. శవం కూడా దొరకకుండా చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె మీడియాతో వెల్లడించారు. రాజతరుణ్, తాను గుడిలో రహస్యంగా పెళ్లిచేసుకున్నామని.. వారి పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదన్నారు.

Read Also: Urfi Javed : ఫుల్ గా తాగిన మత్తులో మీడియాకు అడ్డంగా దొరికిన ఉర్ఫీ జావేద్

అందుకే లివింగ్ రిలేషన్‌లో ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నామన్నారు. హీరోయిన్ మల్హోత్రాతో అఫైర్‌ పెట్టకొని తనను వదిలేశాడని.. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని చెప్పారు లావణ్య. హీరో రాజ్‌తరుణ్‌కు చాలా మందితో అఫైర్స్ ఉన్నాయని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తనను వదిలించు కోవడం కోసం రాజ్ ప్రయత్నిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. రాజ్ డ్రగ్స్ తీసుకోడని… రాజ్‌కి ఇద్దరు హీరోయిన్‌లతో సంబంధాలు ఉన్నాయని రాజ్‌తరుణ్ ప్రేయసి లావణ్య వెల్లడించారు.

లావణ్య మాట్లాడుతూ.. “రాజ్ నన్ను పెళ్లి చేసుకున్నది.. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా తెలుసు.మాళ్విని రాజ్ తరుణ్ పెళ్లిచేసుకోవాలని చూస్తున్నారు. అన్ని రకాలుగా నన్ను వాడుకొని ఇపుడు మాళ్వితో ఉన్నాడు. నా రాజ్ నాకు కావాలి ఆయన లేక పోతే నేను బ్రతకలేను. నాకు ప్రాణ భయం ఉంది. అన్నీ ఆధారాలు పోలీసులకు అందిస్తున్నా. కావాలనే నన్ను డ్రగ్ అడిక్ట్ లాగా క్రియేట్ చేస్తున్నారు. మస్తాన్‌కు నాకు ఎటువంటి సంబంధాలు లేవు. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్ కేసులో మస్తాన్ నిందితుడు. అతని ఫోన్‌లో నా నెంబర్ ఉండటంతో నాకు నోటీసులు ఇచ్చారు. మాల్వీ చెప్పేవన్నీ అబద్ధాలు.” అని మీడియాతో చెప్పారు.

 

Show comments