NTV Telugu Site icon

Tollywood This Week: ఈ ఇద్దరి పరిస్థితేంటి రాజా?

Tollywood This Week

Tollywood This Week

ఈ వారం ఇద్దరు యంగ్ హీరోలకు ఎంతో కీలకంగా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరో కార్తికేయ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. చివరగా ఎఫ్ 3తో సోసో రిజల్ట్ అందుకున్నప్పటికీ… ‘గని’ సినిమాతో మెప్పించలేకపోయాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్‌ ‘గాండీవధారి అర్జున’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా పై వరుణ్‌ మాత్రమే కాదు.. చివరగా ఘోస్ట్‌తో డిజాస్టర్‌ అందుకున్న ప్రవీణ్‌ సత్తారు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతానికైతే మంచి ప్రమోషన్స్‌తోనే ఈ సినిమా ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. ఇక ఆర్స్​ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ మూవీ కూడా 25నే థియేటర్లోకి రానుంది.

Read Also: Balayya: జై బోలో గణేష్ మహారాజ్ కీ అంటున్న ‘భగవంత్ కేసరి’

కార్తికేయ, నేహా శెట్టి కలిసి నటించిన ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకత్వం వహించాడు. ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత కార్తికేయ ఎన్నో చిత్రాలు చేశాడు. కానీ ఒక్కటి కూడా ఆర్ ఎక్స్‌ 100 రేంజ్‌ హిట్‌ అందుకోలేదు. దాంతో ఈ సినిమాపైనే కార్తికేయ భారీ ఆశలు పెట్టుకున్నాడు. వరుణ్ తేజ్-కార్తికేయలు ఇప్పుడు పక్కా హిట్ కొట్టాల్సిన పరిస్థితులో ఉన్నారు. ఏ మాత్రం ఈ రెండు సినిమాల రిజల్ట్ తేడా కొట్టినా వరుణ్ అండ్ కార్తికేయ మార్కెట్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక ఇదే వారంలో మరో రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోతా’ ఆగస్ట్‌ 24న రిలీజ్‌ కానుంది. అలాగే ‘బాయ్స్‌ హాస్టల్‌’ అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా ఈ వారంలోనే రిలీజ్ కానుంది. మరి వరుణ్ తేజ్, కార్తికేయ ఈ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.