Tollywood This Week: కిరణ్ అబ్బవరం vs ఎన్టీఆర్ బామ్మర్ది vs మహేష్ బాబు బావ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 28న స్కంద, పెదకాపు 1, చంద్రముఖి 2 రిలీజ్ అవ్వగా… ఈ వారం ఏకంగా అరడజను సినిమాలు దూసుకొస్తున్నాయి. అన్నీ కూడా మినిమమ్ బజ్ ఉన్న సినిమాలే కావడం విశేషం పైగా ఎన్టీఆర్ బామ్మర్ది, మహేష్ బాబు బావ కూడా ఈ రేసులో ఉండడంతో… ఈ వీక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్‌తో పాటు… సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో… కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘మ్యాడ్’ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన మ్యాడ్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మామా మశ్చీంద్ర’. సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. రీసెంట్‌గా మహేష్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ రెండు సినిమాలు కూడా ఎన్టీఆర్, మహేష్ బాబు ప్రమోషన్స్‌తో థియేటర్లోకి రాబోతున్నాయి.
ఇక కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘రూల్స్ రంజన్’ ఈ వారమే థియేటర్లోకి రానుంది. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తుండగా.. ఆయన తనయుడు రత్నంకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా పై కూడా మంచి బజ్ ఉంది. కానీ మ్యాడ్, మామా మశ్చీంద్ర సినిమాల నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. ఇక కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఇస్తూ.. నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటించిన ‘మంత్ ఆఫ్ మధు’, క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా తెరకెక్కిన 800 కూడా ఈ వారమే రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు సిద్ధార్థ్ నటించిన చిన్నా సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమా ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు సిద్దార్థ్. మొత్తంగా ఈ వారం అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ చిన్న సినిమాల్లో ఏది పెద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!