తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ‘సమ్మర్’ కాసుల వర్షం కురిపించే అతిపెద్ద సీజన్. స్కూల్ సెలవులు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే ఈ సమయంలో పెద్ద సినిమాలు రావడం ఆనవాయితీ కానీ, దురదృష్టవశాత్తూ గత రెండేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలు సమ్మర్ సీజన్‌ను చేజార్చుకుంటున్నారు. తాజా పరిణామాల ప్రకారం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం, ప్రమోషన్స్ ఊసే లేకపోవడంతో ఈ సినిమా జూన్‌కు వాయిదా పడిందని ఇండస్ట్రీ టాక్. ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది వేసవిలో స్టార్ హీరోల సందడి దాదాపు కనుమరుగైనట్టే.
Also Read :Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ
కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి సైతం తన ఫాంటసీ అడ్వెంచర్ ‘విశ్వంభర’తో సమ్మర్‌కు వస్తారని భావించినా, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల కారణంగా అది జూలైకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు సమ్మర్ అంటే సినిమాలకు పండగ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దీనికి ప్రధానంగా క్రికెట్ మేనియా వల్ల సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే భయం స్టార్ హీరోలను వెంటాడుతోంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ పనుల వల్ల అనుకున్న సమయానికి సినిమాలు పూర్తి కాకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సమ్మర్‌లో వచ్చిన ఏకైక స్టార్ హీరో పవన్ కళ్యాణ్, ఆయన నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య మార్చిలో విడుదలైంది. అయితే, ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాకపోవడంతో భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో సమ్మర్ అంటేనే టాలీవుడ్ మేకర్స్ భయపడే పరిస్థితి నెలకొంది. సినిమాలకు అసలైన సీజన్ సమ్మర్ అని అందరికీ తెలుసు. కానీ, స్టార్ హీరోలు, నిర్మాతలు పక్కా ప్లానింగ్‌తో రాకపోతే ఈ సీజన్ కాస్తా ‘అన్-సీజన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మరి జూన్ లోనైనా ‘పెద్ది’, ‘విశ్వంభర’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేడిని పెంచుతాయో లేదో వేచి చూడాలి.
