NTV Telugu Site icon

Whatsapp Channel: ‘వాట్సాప్ ఛానల్’ని స్టార్ట్ చేసిన హీరోలు వీళ్లే…

Whastapp Channel

Whastapp Channel

నిద్ర లేచింది మొదలు… మళ్లీ నైట్ పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులోనూ వాట్సాప్ లేకుంటే రోజు గడవదు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ గ్రూపులు, సరదా కబుర్లు, అకేషన్ అప్డేట్స్, స్టాటస్ అప్డేట్స్.. ఎవరేం చేస్తున్నారు? ఇలా ఒక్కటేమిటి ప్రతి సమాచారాన్ని తెలిపే ఏకైక ఆప్షన్ వాట్సాప్. ఇది లేని మొబైల్‌ ఉండనే ఉండదు. అందుకే వాట్సాప్‌లో కొత్తగా వాట్సాప్ ఛానల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎవ్వరైన సరే ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు.

Read Also: Krithi Shetty: రెడ్ డ్రెస్ లో కృతి శెట్టి అందాల విందు

వారిలో  తెలుగు స్టార్స్‌ను తీసుకుంటే… దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశారు. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొత్తగా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాడు. ఈ ఇద్దరు కూడా ఒకే రోజు ఛానల్ క్రియేట్ చేశారు. ఇంకా వీళ్లు ఛానల్ క్రియేట్ చేసినట్లుగా పెద్దగా అభిమానులకు తెలియదు కాబట్టి… ఇక పై ఫాలో అయిపోయి.. మీ వాట్సాప్‌ కాంటాక్ట్స్‌లో చూసుకొని మురిసిపోండి. అయితే రాజమౌళి, ఎన్టీఆర్ కంటే ముందే.. వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన తొలి తెలుగు హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. సెప్టెంబర్ 6న ఛానల్ క్రియేట్ చేశాడు రౌడీ. హిందీలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, సన్నీ లియోన్.. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు వాట్సాప్ ఛానల్‌లో ఉన్నారు. ఇక ఈ వాట్సాప్ ఛానల్ అందుబాటులోకి రావడంతో.. తమ తమ ఫేవరేట్ హీరోలను లక్షల్లో ఫాలో అవుతున్నారు అభిమానులు.

Read Also: Prabhas: ‘కల్కి’ సీరియస్ వార్నింగ్!

Show comments