Tollywood Rewind 2023: Debut Heroines Faced Disasters in Tollywood 2023: ఎట్టకేలకు 2023 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నా ఎందుకో వారు నటించిన సినిమాలు మాత్రం అంతగా హిట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్లు ఎవరెవరు అనే విషయం పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
సాక్షి వైద్య: ముందుగా సాక్షి వైద్య విషయానికి వస్తే ఈ భామ అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మొదటి సినిమా ఆమెకు దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందించింది. తర్వాత వరుణ్ తేజ్ హీరోగా గాండీవదారి అర్జున అనే సినిమాతో మరోసారి లక్ పరీక్షించుకునే ప్రయత్నం చేసుకుంది కానీ అది కూడా దారుణమైన డిజాస్టర్ గా నిలవడంతో ఆమెకు 2023 రెండు టాలీవుడ్ డిజాస్టర్స్ ను అందించినట్లు అయింది.
యుక్తి తరేజ: నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి అనే సినిమాతో ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో సక్సెస్ అందుకోవాలనుకున్న ఈ భామకు ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని అందించింది
ఐశ్వర్య మీనన్: ఈ మలయాళీ భామ నిఖిల్ హీరోగా నటించిన స్పై అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో పాగా వేయాలనుకుంటే ఆ సినిమా మాత్రం ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు
అవంతిక దసాని : ఈ భామ ఉప్పలపాటి రాకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులో లాంచ్ అయింది. బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కుతుంది అనుకుంది కానీ ఈ సినిమా ఆమె కెరియర్ లో దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.
గీతికా తివారి: తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతూ చేసిన అహింస సినిమాలో హీరోయిన్గా నటించింది. మొదటి సినిమాతోనే ఆమె తెలుగులో మంచి ఎంట్రీ దొరికింది అనుకుంది కానీ ఆ సినిమా ఆడకపోవడంతో ఆమెకు మళ్ళీ అవకాశాలే దక్కలేదు.
ఆషిక రంగనాథ్: ఈ కర్ణాటక బ్యూటీ తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నందమూరి హీరోతో పడింది ఇక కెరియర్ కు తిరిగే లేదనుకుంది కానీ ఆ సినిమా ఆడకపోవడంతో ఆమెకు మరో అవకాశం దక్కడానికి చాలా సమయం పట్టింది.
గాయత్రీ భరద్వాజ్, నుపూర్ సనన్: ఈ ఇద్దరు బాలీవుడ్ భామలు రవితేజ హీరోయిన్ గా నటించిన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా అనూహ్యంగా హ్యాండ్ ఇచ్చింది.
అనిఖా సురేంద్రన్: బాలనటిగా పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన ఈ భామ బుట్ట బొమ్మ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై అనిఖా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.
ప్రగతి శ్రీవాస్తవ: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన ఈ పెద్దకాపు సినిమా ద్వారా ప్రగతి తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో ఆమెకు ఈ సినిమా ఏ మాత్రం కలిసి రాలేదని చెప్పాలి.