NTV Telugu Site icon

Tollywood Releases: ఈ వారమంతా డబ్బింగ్ సినిమాలదే హవా.. ఏమేం రిలీజ్ అవుతున్నాయంటే?

Japan Jigarthanda Double X

Japan Jigarthanda Double X

Tollywood Releases this week: ఇక నవంబర్ 12న దీపావళి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే ఈ సారి డైరెక్ట్ తెలుగు సినిమాలు తక్కువగానే ఉన్నాయి. వాటి కంటే డబ్బింగ్ సినిమాలదే హవా కనిపిస్తోంది. ఇక తమిళ హీరో కార్తీ తాజాగా నటించిన జపాన్ నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. .ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నవంబర్ 10న దీపావళి పండుగ కానుకగా విడుదల చేయనున్నారు. రాఘవ లారెన్స్‌, ఎస్‌. జె.సూర్య కీలక పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ రూపొందిస్తున్న జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌ ని కూడా మూవీ దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే దినేశ్‌ తేజ్‌ హీరోగా నటించిన అలా నిన్ను చేరిలో హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్స్ గా నటించారు.ఈ మూవీకి మారేష్‌ శివన్‌ దర్శకత్వం వహించగా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Payal Rajput : నా కెరీర్ లో ఆ సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోయింది…

తెలుగులో జనం అనే మరో చిన్న సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక ఇవి కాక ది మార్వెల్స్‌ అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమానవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది. మార్వెల్‌ కామిక్స్‌ ఆధారంగా రానున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది. నియా డకోస్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక తమిళ రాము వెంకట్, దీపన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దీపావళి. రా వెంకట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క మనీష్‌ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం టైగర్‌3లో కత్రినా కైఫ్‌ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ దీపావళి సందర్భంగా నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.