Site icon NTV Telugu

Tollywood : మే’లో వరుస రీ రిలీజ్ లు!

Tollywood (2)

Tollywood (2)

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. పుష్ప2 తర్వాత బన్నీ కనిపించకపోయినా రేసు గుర్రం రీరిలీజ్ రూపంలో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు. మహేష్ బాబు కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరవడం కష్టమే. జక్కన్న రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి.. ఓ వైపు సంతోషంగా ఉన్నా.. మరో వైపు తమ హీరోను తెరపై చూడలేకపోతున్నామన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. వారణాసి రావడానికి ఇంకా ఏడాది టైం ఉన్ననేపథ్యంలో రీ రిలీజెస్ వాళ్లకు ఊపిరిపోస్తున్నాయి. అతడు, బిజినెస్ మాన్, ఖలేజా ఇప్పటికే థియేటర్స్‌లో న్యూ వర్షన్స్‌తో సందడి చేయగా.. నెక్ట్స్ అతిధి రాబోతుంది. మే 29న రీరిలీజ్ కాబోతుంది. అయితే బీజీఎం కోసం మణిశర్మ రీ వర్క్ చేయబోతున్నాడని టాక్ రాజా సాబ్‌తో డార్లింగ్ ఈ ఏడాది హాయ్ చెప్పినా.. ఆడియన్స్‌కు శాటిస్పాక్షన్ కాలేకపోయారు. ఫౌజీ కోసం వెయిటింగ్. అది రావడానికి ఇంకా ఎనిమిది నెలలు పట్టేట్టుగా కనిపిస్తుంది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.. కానీ ఈమధ్యలోనే ప్రభాస్.. తన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ డార్లింగ్‌తో హాయ్ చెప్పబోతున్నాడు. ఏప్రిల్ 23న 4కె వర్షన్‌లో రీ రిలీజ్ కాబోతుంది డార్లింగ్

Also Read :Gold Income: ఒక్క గ్రాము బంగారంపై రూ.11,221 లాభం.. ఆర్బీఐ కీలక ప్రకటన..

దేవర హిట్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ తీసుకున్నాడు తారక్. వార్2 అంచనాలపై దెబ్బేయడంతో ఫ్యాన్స్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న డ్రాగన్‌పైనే హోప్స్ పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మూవీ.. తర్వాత జూన్ 25కి పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ డేట్‌కు కూడా రాకపోవచ్చునని తెలుస్తోంది. షూటింగ్ 40-50 శాతం వరకు కంప్లీట్ అయ్యిందట . ఈ లెక్కన తారక్ కూడా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ స్కిప్ చేస్తున్నట్లే. అయితే బర్త్ డేకు డబుల్ బోనొంజా ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్లాపైనా.. కల్ట్ సినిమాలుగా నిలిచిన ఊసరవెల్లి, ఆంధ్రావాలాతో పలకరించబోతున్నాడట. మే 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట.

Exit mobile version