NTV Telugu Site icon

Tollywood producers guild committee : సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీలు

Guild Commiteee

Guild Commiteee

Tollywood producers guild committee:
యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుండి షూటింగ్‌లను నిలిపివేయాలని మంగళవారం అధికారికంగా నిర్ణయించింది. కారణంగా నిర్మాణ వ్యయం పెరగటం… అందు మూలంగా నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించింది. ఇక తమ సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనడానికి గిల్డ్ కమిటీలను నియమించింది. అందులో భాగంగా థియేట్రికల్, ఎగ్జిబిషన్ సమస్యలపై చర్చించడానికి దిల్ రాజు కన్వీనర్ గా సుధాకర్ రెడ్డి, యువి వంశీ, వీరినాయుడు, బన్నీవాసు, సాయిబాబు అన్నపూర్ణ, రామ్ మోహన్, ఎన్వీ ప్రసాద్ తో ఓ కమిటి వేసింది. అలాగే ఓటీటీ హోల్డ్ బ్యాక్ పై చర్చకు బాపినీడు కన్వీనర్ గా ఏఎం రత్నం, పి.కిరణ్, మైత్రీ రవి, యువి వంశీ, శరత్ సభ్యులుగా ఇక ప్రొడక్షన్ కాస్ట్ సమస్యలపై చర్చించేందుకు వివేక్ కూచిభొట్ల కన్వీనర్ గా నాగవంశీ, రవికిశోర్, శివలెంక కృష్ణప్రసాద్, మధు, కిషోర్, రాధామోహన్, 14 రీల్స్ గోపి, బెక్కం వేణు గోపాల్‌, చిట్టూరి శ్రీనివాస్, సుధాకర్ చెరుకూరి, దామోదర్ ప్రసాద్, సాహు గారపాటి, అనురాగ్ పర్వతనేనితో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీలన్నీ ఆ యా సమస్యలపై చర్చించి, సాధ్యమైన మేరకు పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేస్తాయి. అప్పటి వరకు షూటింగ్‌లను ఆపటానికి నిర్ణయం తీసుకుంది గిల్డ్. మరి ఈ కమిటీలు త్వరగా తగిన పరిష్కారాలను కనుగొని వీలయినంత త్వరగా షూటింగ్ లు ఆరంభించేలా చేస్తాయని ఆశిద్దాం.