Anirudh : టాలీవుడ్ ప్రొడ్యూసర్ల ‘అనిరుధ్’ జపం.. ఏకంగా రూ. 25 కోట్లకు చేరిన రెమ్యునరేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవీశ్రీ ప్రసాద్, థమన్ వైపు మొగ్గు చూపిన తెలుగు నిర్మాతలు ఇప్పుడు మాత్రం కథ, బడ్జెట్‌తో సంబంధం లేకుండా కేవలం అనిరుధ్ మాత్రమే కావాలని పట్టుబడుతున్నారు. అనిరుధ్ క్రేజ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను మార్చేస్తుండటంతో టాలీవుడ్ మేకర్స్ ఆయన అడిగినంత ఇవ్వడానికి వెనుకాడటం లేదు.
నిజానికి అనిరుధ్ ట్యూన్స్ ఇవ్వడంలో బాగా లేట్ చేస్తాడని రీ-రికార్డింగ్ సమయంలోనూ సమయానికి అవుట్‌పుట్ ఇవ్వడని పరిశ్రమలో గట్టి టాక్ ఉంది. అయినప్పటికీ అనీకున్న విపరీతమైన క్రేజ్ కారణంగా అందరికీ అతడే కావాలి. ఈ డిమాండ్‌ను బేస్ చేసుకుని మన తెలుగు నిర్మాతలే అనీ రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశారు. ఒకప్పుడు రూ. 15 కోట్ల రూపాయలుగా ఉన్న అనిరుధ్ పారితోషికాన్ని, వరుస క్రేజీ ఆఫర్లతో ఏకంగా రూ. 25 కోట్ల రూపాయలకు పెంచేసి దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిపారు. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న ‘AA23’, అలాగే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలు సంగీతం అందిస్తున్నారు. తమిళంలో విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, ధర్మన్, రజనీ-కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టులకు అనిరుధ్ తన మ్యూజిక్‌తో థియేటర్లను షేక్ చేయబోతున్నారు.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!