Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tollywood November Month Progress Report

Progress report: నవంబర్ లోనూ డబ్బింగ్ సినిమానే నంబర్ వన్!

Published Date :November 26, 2022 , 3:10 pm
By Omprakash Vaddi
Progress report: నవంబర్ లోనూ డబ్బింగ్ సినిమానే నంబర్ వన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tollywood: అక్టోబర్ మాసంలో కన్నడ అనువాద చిత్రం ‘కాంతార’ సూపర్ హిట్ అయ్యి, ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. విశేషం ఏమంటే… నవంబర్ నెలలో కూడా అనువాద చిత్రానిదే పై చేయి అయ్యింది. 25వ తేదీ విడుదలైన తమిళ డబ్బింగ్ ఫిల్మ్ ‘లవ్ టు డే’ ఈ నెలలో రిలీజ్ అయిన చిత్రాలన్నింటిలోకి బెస్ట్ కలెక్షన్స్ సాధించబోతోంది. ‘లవ్ టుడే’ మొదటి రోజునే దాదాపు రెండున్నర కోట్ల గ్రాస్ కలెక్షన్ల ను సాధించింది. ఈ వారం విడుదలైన ఇతర చిత్రాలేవీ, ఇందులో సగం కలెక్షన్స్ కూడా సాధించలేదు. దాంతో నవంబర్ మొత్తానికీ ‘లవ్ టు డే’నే బెస్ట్ మూవీగా నిలువబోతోంది.

నవంబర్ ఫస్ట్ వీకెండ్ లో ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి. అందులో అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ కూడా ఒకటి. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు మంచి ఓపెనింగ్సే వచ్చినా… ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. వచ్చిన టాక్ కూ… థియేటర్లలో కలెక్షన్స్ కు సంబంధం లేకపోయింది. అదే శుక్రవారం సంతోష్‌ శోభన్ నటించిన ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ కూడా రిలీజ్ అయ్యింది. బట్… ప్రీ రిలీజ్ బజ్ కు తగ్గట్టుగా ఈ మూవీకి ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక నందు నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సైతం ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. ఇదే వారం తమిళ డబ్బింగ్ మూవీ ‘ఆకాశం’, కన్నడ అనువాద చిత్రం ‘బనారస్’ వచ్చాయి. కానీ జనాలు ఈ మూవీస్ గురించి మాట్లాడుకోలేదు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాలుగా లాబ్ లోనే మగ్గిపోయిన అక్కినేని నాగేశ్వరరావు ‘ప్రతిబింబాలు’ సినిమా ఎట్టకేలకు నవంబర్ 5న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పరాజయం పాలు కావడంతో నిర్మాత, పంపిణీదారులు మధ్య మనస్పర్థలు ఏర్పడి, పోలీస్ కేసులయ్యాయి.

నవంబర్ సెకండ్ వీకెండ్ లో వచ్చిన సినిమాల్లో అందరి దృష్టి సమంత నటించిన ‘యశోద’ పైనే ఉంది. ఊహించిన దానికంటే ఈ మూవీకి బెటర్ టాక్ వచ్చింది. సమంత నటించిన గత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ‘యశోద’ పూర్తి భిన్నంగా ఉందని, ఇది తప్పకుండా జనాలను ఆకట్టుకుంటుందని అంతా భావించారు. కానీ థియేటర్లలో ఈ సినిమా పెద్దంత సందడి చేయలేకపోయింది, మూవీ జస్ట్ యావరేజ్ గా నిలిచిపోయింది. ఈ వారం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ పాంథర్’ దానికున్న క్రేజ్ కు తగ్గట్టు మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. ఇక థర్డ్ వీకెండ్ లో వచ్చిన సినిమాలలో హారర్ థ్రిల్లర్ ‘మసూద’ టెక్నికల్ గా బెస్ట్ మూవీ అనిపించుకుంది. ఇదే వారంలో ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ కూడా విడుదలైంది. మసూద’ కలెక్షన్లు క్రమంగా పెరుగుతుంటే… ‘గాలోడు’కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. వీటితో పాటే వచ్చిన మరే సినిమా గురించి జనం మాట్లాడుకోలేదు.

నవంబర్ లాస్ట్ వీకెండ్ లో వచ్చిన సినిమాలలో థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ మూవీతో కొందరు దీనిని పోల్చినా, ఆ స్థాయి విజయం ఈ సినిమాకు దక్కదనేది ఓపెనింగ్స్ బట్టీ తేలిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళంలో ఘన విజయం సాధించిన ‘లవ్ టుడే’ మూవీ కూడా 25వ తేదీన వచ్చింది. యూత్ ను టార్గెట్ చేస్తూ, ప్రదీప్ రంగనాథ్ తెరకెక్కించి, నటించిన ‘లవ్ టు డే’కు తెలుగునాట హిట్ టాక్ వచ్చేసింది. ఇదే శుక్రవారం హిందీ చిత్రం ‘బేడియా’ను తెలుగులో ‘తోడేలు’గా అనువదించి, అల్లు అరవింద్ విడుదల చేశారు. త్రీడీలో రూపొందిన ఈ హారర్ మూవీ జనాలను మెప్పించడంలో విఫలమైంది. మరో రెండు, మూడు చిన్న సినిమాలు ఈ వీకెండ్ లో జనం ముందుకు వచ్చినా, ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో ఈ నెల విజేత ‘లవ్ టుడే’ అని చెప్పొచ్చు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Galoodu
  • Love today
  • Masooda
  • Thodelu
  • Urvasivo Rakshasivo

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions