Site icon NTV Telugu

Tollywood: దసరా.. ఈసారి అప్డేట్స్ ఏం లేవమ్మా

Charan

Charan

Tollywood: పండుగ వచ్చిందంటే.. చాలు. అందరు.. ఆరోజు ఏం చేయాలో ముందు నుంచే ఆలోచిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు గుడులు, పూజలు చేస్తారు. పిల్లలు .. ప్రసాదాలు, స్వీట్స్ మీద పడతారు. ఇక మూవీ లవర్స్ అయితే.. సినిమాలు.. థియేటర్ లు.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు. ఆరోజు సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం.. దసరా శుభాకాంక్షలతో తమ అభిమాన హీరోల ఫొటోలతో పాటు.. కొత్త సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్, టీజర్ లాంటి అనౌన్స్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ దసరా కోసం మాత్రం చాలామంది హీరోల అభిమానులు అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Allu Arjun: పార్టీ ఇస్తున్న పుష్ప.. షెకావత్ సారూ కూడా వస్తున్నారట..?

ఇక ఆ హీరోలు ఎవరంటే.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్. మొదటినుంచి కూడా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒక్క అప్డేట్ ఇవ్వమని ఫ్యాన్స్ .. మేకర్స్ ను బతిమాలుకుంటున్నారు. ఒక అభిమాని అయితే ఏకంగా చచ్చిపోతాను అని బెదిరించాడు కూడా. దీంతో మేకర్స్ దసరాకు ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేస్తామని చెప్పినట్లు సమాచారం అందింది. అయితే అది అంతా నిజం కాదని తెలుస్తోంది. సాంగ్ రిలీజ్ కు రెడీ గా ఉన్నా దసరాకు రిలీజ్ చేసే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే చరణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేయడం ఖాయం. ఇక దీంతో పాటు.. ఎన్టీఆర్ దేవర నుంచి కానీ, మహేష్ బాబు గుంటూరు కారం నుంచి కానీ ఎలాంటి అప్డేట్స్ ఉండవని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది దసరా రోజునే తెలుస్తుంది.

Exit mobile version