Site icon NTV Telugu

Music Directors : తెలుగు కంపోజర్స్‌కు పాకిన డ్యూయల్ రోల్ ఫాంటసీ

Dsp

Dsp

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదలైందా? మ్యూజిక్ డైరెక్టర్లు మైక్ వదిలి మేకప్ వేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి లేటెస్ట్ అప్‌డేట్స్. ఎందుకంటే మ్యూజిక్ కంపోజర్స్ అంటే కేవలం రికార్డింగ్ రూమ్‌కే పరిమితం కానక్కర్లేదు, వెండితెరపై హీరోలుగానూ మెప్పించగలమని ఇప్పటికే కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్‌, విజయ్ ఆంటోనీ, హిప్ హప్ తమిళ వంటి వారు నిరూపించారు. బాలీవుడ్‌లో హిమేష్ రేష్మియా కూడా ఇదే బాటలో సాగారు, ఇప్పుడు ఆ ‘డ్యూయల్ రోల్’ ఫాంటసీ మన టాలీవుడ్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చాలా కాలంగా వినిపిస్తున్న వార్త నిజమైంది. రాక్ స్టార్ డిఎస్పీ ఇప్పుడు హీరోగా మారుతున్నారు. ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో ఆయన వెండితెరపై కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

Also Read:Akkineni Heroes : ముగ్గురు అక్కినేని హీరోల త్రిశూల వ్యూహం!

కేవలం దేవీశ్రీ ప్రసాద్ మాత్రమే కాదు, మన మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా మళ్లీ మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది, గతంలో ‘బాయ్స్’ చిత్రంతో నటుడిగా మెరిసిన తమన్, చాలా కాలం తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. తమిళ చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా మారి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం, విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ వంటి చిత్రంతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జీవీ ప్రకాష్ వరుస సినిమాలతో హీరోగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు అదే బాటలో తెలుగు కంపోజర్స్ కూడా ప్రయాణం మొదలుపెట్టారు, దేవీశ్రీ ప్రసాద్ తనలోని డ్యాన్సర్ ని, పర్ఫార్మర్ ని ‘ఎల్లమ్మ’ ద్వారా ఏ స్థాయిలో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సంగీత దర్శకులు హీరోలుగా మారడం అనేది టాలీవుడ్‌లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి!

Exit mobile version