Site icon NTV Telugu

పెళ్లి తరువాత కూడా బాత్ టబ్ లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్..

pranitha

pranitha

అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ తో బాపుగారి బొమ్మో అంటూ పాట పాడించుకున్న హీరోయిన్ ప్రణీత. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ భారీ విజయాన్ని ఒక్కటి కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత అడపాదడపా చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ సడెన్ గా బిజినెస్ మెన్ నితిన్ రాజ్‌ను పెళ్ళాడి అందరికి షాక్ ఇచ్చింది. కరోనా సమయం కాబట్టి అందరిని పిలవలేదు అని కవర్ చేసింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటిన్యూ చేస్తానని చెప్పిన ప్రణీత నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రాళ్లను ఆకట్టుకొంటుంది.

ఇక తాజాగా ప్రణీత పోస్ట్ చేసిన ఒక వీడియో హాట్ టాపిక్ గా మారడంతో పాటు నెటిజన్ల విమర్శలను కూడా అందుకొంటుంది. తాజాగా ప్రణీత బాత్ టబ్ వీడియోను పోస్ట్ చేసింది. బాత్ రూమ్ లోని ఒక టబ్ లో ఒళ్ళంతా సబ్బు నురగను పూసుకొని జలకాలాడుతూ కనిపించింది. అయితే మరి అంత నగ్నంగా అమ్మడు లేదు. అయినా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. పెళ్లి తరువాత ఇలాంటి వీడియోలను ఎలా పోస్ట్ చేస్తున్నారు అని కొందరు.. అవకాశాలు లేక ఇలా ట్రై చేస్తున్నావా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version