The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
- ‘ది పారడైజ్’ ప్రీమియర్ షో..
- ర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని హీరో నాని ఆకాంక్ష.
- సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అధికారులను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో నాని విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani Requests CM Revanth Reddy: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది పారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని నేడు (సెప్టెంబర్ 23) ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి తన సినిమా చూడాలని హీరో నాని ఆశిస్తున్నాడు.
ఈ మేరకు నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసు అధికారులను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. చిన్నప్పటి నుంచే సినిమాను ఎంతో ఇష్టపడే అభిమానిగా, ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటంలోనే తనకు ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందని ఆయన పేర్కొంటూ తనకి సినిమా చూడడానికి అనుమతివ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
Also Read
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్లలో సినిమా చూడటం తనకు ఎంతో ప్రత్యేకమని.. నేడు ‘ది పారడైజ్’ ప్రీమియర్ షోకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లి, తాము ఎవరి కోసం సినిమా తీశారో ఆ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఉందన్నారు. ఒక సినిమా రూపొందించిన తర్వాత ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా అనుభవించడంలోనే నటుడిగా తనకు అసలైన సంతృప్తి లభిస్తుందని నాని అన్నారు. ప్రేక్షకులతో కలిసి సినిమా అనుభూతిని పంచుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పోస్టులో రాసుకొచ్చాడు.
ఈ సందర్భంగా అమల్లో ఉన్న అన్ని నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని నాని స్పష్టం చేశారు. భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి, సంబంధిత అధికారులు పరిశీలించి అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు నాని పేర్కొన్నారు. ‘ది పారడైజ్’కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇదివరకు “పుష్ప” సినిమా విడుదల నేపథ్యంలో జరిగిన ఘటన నేపథ్యంలో.. హీరో నాని సోషల్ మీడియాలో ఇలా విజ్ఞప్తి చేసి ముందు జాగ్రత్తలు తీసుకొని ఉండవచ్చు కాబోలు..
Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu, Hon’ble Minister of Cinematography Shri @KomatireddyKVR Garu & the respected officials of @TelanganaCOPs.
This is a request from a fan of cinema and, more importantly, someone who has enjoyed cinema at its very best from a very…
— Nani (@NameisNani) September 22, 2026
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!