Site icon NTV Telugu

Tollywood Film Producers : షూటింగ్స్ మొదలయ్యేది ఎప్పటినుంచి!?

Producers Guild

Producers Guild

Tollywood Film Producers  : సినిమాల నిర్మాణ వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న వైనాన్ని గమనించి టాలీవుడ్ షూటింగ్ లను నిలిపి వేసి తగ్గింపు చర్యలను మొదలు పెట్టింది. నిర్మాణ వ్యయానికి తోడు ఓటీటీ విడుదల అవగాహనా ఒప్పందాలు, డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలు, టిక్కెట్ ధరలు వంటి విషయాలపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చాలా వరకూ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి తెలుగు సినిమాల షూటింగ్ నిలిపివేయటం ఓ విధంగా షాకింగ్ అంశమే. వరుస పరాజయాలనుంచి కోలుకుని మళ్ళీ వరుసగా ‘సీతారామం, బింబిసార, కార్తికేయ2’ విజయాలతో కళకళలాడుతోంది.

ఇక నటీనటలుతో చర్చల ఫలితాలు కూడా పాజిటీవ్ గా ఉండటంతో ఈ నెల 22 నుండి షూటింగ్‌లు మళ్ళీ పెద్ద సినిమాల షూటింగ్స్ ప్రారంభమవుతాయని వినిపిస్తోంది. ఓ వైపు చిన్న సినిమాల షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. బాలకృష్ణ, మహేష్-త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ వంటి సినిమాలను వీలయినంత త్వరగా ప్రారంభించడానికి రెడీగా ఉన్నాయి. అలాగే రవితేజ, నాని తో పాటు ఇతర హీరోలు కూడా తమ ప్రాజెక్ట్‌ల షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిలిమ్ ఛాంబర్ తో పాటు గిల్డ్ కి సంబంధించిన నిర్మాతలు అతి త్వరలో ఈ విషయాన్ని అధికారికగా ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి మళ్ళి అన్ని సినిమాల షూటింగ్స్ తో చిత్రపరిశ్రమ కళకళలాడుతూ విడుదల కాబోయే సినిమాలు సైతం ఘన విజయాలు సాధించాలని కోరుకుందాం.

Exit mobile version