Site icon NTV Telugu

డ్రగ్స్ కేసు: ఫెమా కేసులు నమోదు చేసే యోచన

టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల ఆస్తుల జప్తు దిశగా ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3, 4 ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేశారు. ఆబ్కారీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ఫెమా కేసులు నమోదు చేసే యోచనలో వున్నారు. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ తారలకు నోటిసులను జారీచేసిన సంగతి తెలిసిందే. విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. ఈనెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈడీ ప్రశ్నించనుంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version