NTV Telugu Site icon

Tollywood: ఫోటో అదిరింది.. వాళ్లు కూడా ఉంటే ఇంకా బావుండేది

Tollywood

Tollywood

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. అంటే ఇష్టపడే ప్రేక్షకులు మెల్లిగా డైరెక్టర్లను ఇష్టపడుతున్నారు. డైరెక్టర్ ఎవరైతే మనకెందుకు.. హీరో ముఖ్యం అనే దగ్గరనుంచి.. హీరో ఎవరైతే మనకెందుకు డైరెక్టర్ ముఖ్యం అనేలా జనరేషన్ మారిపోయింది. ఇక ప్రస్తుతం కుర్ర డైరెక్టర్లదే టాలీవుడ్ లో హవా అంతా. ఒక్క సినిమా హిట్ కొట్టడం.. స్టార్ హీరోను లైన్లో పెట్టడం ఇదే జరుగుతుంది. ఇప్పటివరకు ఒక డైరెక్టర్, మహా అయితే ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లు ఒక చోట ఉన్నప్పుడు చూసి ఉంటాం. కానీ, టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అందరూ ఒకే ఫొటోలో కనిపిస్తే.. ఇదిగో ఇంత అందంగా కనిపిస్తుంది. ఇక ఈ అరుదైన ఫోటోను డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ .. మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేనికి బర్త్ డే విషెస్ తెలిపాడు. ” నవీన్ యెర్నేని గారు.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మైత్రీ మూవీ మేకర్స్.. అన్ని ఇచ్చినందుకు థాంక్స్” అని చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan: విశాఖ బోటు ప్రమాదం.. ఆర్థిక సాయం ప్రకటించిన జనసేనాని

ఇక ఈ ఫోటోలో ఇప్పుడు స్టార్ హీరోస్, సీనియర్ హీరోస్ తో చేస్తున్న డైరెక్టర్స్ అందరూ.. నవీన్ యెర్నేనితో ఉన్నారు. గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా, హను రాఘవపూడి, హరీష్ శంకర్, సుకుమార్, వెంకీ కుడుమల, రాహుల్ సంకీర్త్యన్ కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్పకు నేషనల్ అవార్డు వచ్చినసందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ఈ ఫోటో దిగినట్లు కనిపిస్తుంది. ఇదే ఫొటోలో రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ కూడా ఉండి ఉంటే ..పిక్చర్ పర్ఫెక్ట్ అయ్యి ఉండేది అని కొందరు..టాలీవుడ్ భవిష్యత్తు అంతా ఈ ఒక్క ఫొటోలోనే కనిపిస్తుందే.. అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments