మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుల నేడు. “ఆర్ఆర్ఆర్”ను బ్లాక్ బస్టర్ హిట్ చేసి చెర్రీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు ప్రేక్షకులు. ఇక పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులతో సెలెబ్రిటీలు, రామ్ చరణ్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యంగ్ హీరో నేడు సీతారామరాజుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ తో కలిసి “ఆచార్య”లో కనిపించబోతున్నాడు. ఇక నాలుగేళ్ళ తరువాత తెరపై కన్పించిన రామ్ చరణ్ కు సినిమా విడుదల కూడా కలసి రావడంతో ఆయన అభిమానులు బర్త్ డే వేడుకను ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ కు సెలెబ్రిటీలలో ఎవరెవరు బర్త్ డే విషెస్ ఎలా అందించారో చూద్దాం.
Read Also : Allu Arjun and Kalyan Ram : షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు… హీరోలకు జరిమానా
