NTV Telugu Site icon

Happy Ugadi : శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు… సెలెబ్రిటీల విషెస్

Chiranjeevi

Chiranjeevi

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం… ఈరోజు తెలుగు వారికి మరో కొత్త సంవత్సరం ప్రారంభం. తెలుగు వారు సాంప్రదాయకంగా భావించే ఉగాది పండగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2, శనివారం వచ్చింది. ఈ పండగ సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా తమ ఇంటిని మామిడి ఆకులతో, పూల దండలతో అలంకరిస్తారు. రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. కొత్త బట్టలు ధరించి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి రుచిని ఆస్వాదిస్తారు. ఇక సోషల్ మీడియాలోనూ ఉగాది పండగ హడావిడి కన్పిస్తోంది. సెలెబ్రిటీలంతా ట్విట్టర్ లో తమ అభిమానులకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.