చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగింది. చాలా మంది అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫహద్ ఫాసిల్ యొక్క ఇంటెన్స్ రోల్‌కి, సమంత ప్రత్యేక సాంగ్ కి, రష్మిక మందన్న డి-గ్లామ్ లుక్, సుకుమార్ దర్శకత్వం… ఇలా అన్నీ సినిమాలో సూపర్ గా ఉన్నాయంటూ ప్రేక్షకులు “పుష్ప : ది రైజ్”పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగానే ‘పుష్ప’ ఫైర్ అంటుకుంది. ఆ ఫైర్ కు ‘తగ్గేదే లే’ అంటూ స్టార్ హీరోలు సైతం చిత్రబృందాన్ని విష్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు పలువురు స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ‘పుష్ప’కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేశారు.
Read also : థియేటర్లో ‘ఊ’ అంటూ ఊగిపోతున్న ఫ్యాన్స్… సామ్ సాంగ్ రచ్చ
