టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా మంత్రి పేర్నినానిని కలిశారు. సచివాలయంలో మంత్రితో సినీ నిర్మాత దిల్ రాజు, అలంకార్ ప్రసాద్, పలువురు ఇతర నిర్మాతలు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు. నిన్నటి క్యాబినెట్ లో ఆల్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయాల అంశంపై సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై ఈ మీటింగ్ లో చర్చ జరిగింది. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. మంత్రితో సమావేశంలో ప్రత్యేక విషయం ఏమి లేదని, కొన్ని వివరణలు అడిగగా, ఆ సమాచారం ఇవ్వటానికే వచ్చామని వెల్లడించారు. మిగిలిన విషయాలు అధికారికంగా మంత్రి చెబుతారని తెలిపారు దిల్ రాజు.
Read Also : బిగ్ బాస్ 5 : హౌజ్ లోకి ఈ బ్యూటీల రీఎంట్రీ ?
అయితే నిన్ననే నాగార్జున పలువురి తో వెళ్ళి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం, ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనంతరం నాగ్, జగన్ మధ్య చర్చలు జరగడం తెలిసిందే. తరువాత నాగార్జున కేవలం వ్యక్తిగతంగా మాత్రమే సీఎంను కలిశానని పేర్కొన్నప్పటికీ, మళ్ళీ ఈరోజు సినీ ప్రముఖులు మంత్రి పేర్ని నానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
