Site icon NTV Telugu

Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ..

Murali Mohan

Murali Mohan

Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో మురళీ మోహన్, సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిలిం నగర్ సోసైటీలో ఫిలిం ఛాంబర్ ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు సురేష్ బాబు.

Read Also : Mass Jathara : రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ రిలీజ్

మురళీ మోహన్ మాట్లాడుతూ చైన్నై నుంచి హైదరాబాదు చిత్ర పరిశ్రమ రావటానికి ఫిలిం నగర్ సోసైటీ లో ఫిలిం ఛాంబర్ ను ఇచ్చారన్నారు. ఇప్పటికి నలభై ఏళ్లు అవుతోందని.. దీనిని చిత్రపరిశ్రమకు కోసం తప్ప వేరె వాటికి ఉపయోగించకూడదన్నారు. ఫిలిం ఛాంబర్ అభివృద్దిపై సినీ పెద్దలు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి నిర్ణయం తీసుకుకోవాలని కోరారు.

Read Also : Sree Leela : పవన్ సినిమా నెక్ట్స్ లెవల్ అంతే.. శ్రీలీల హింట్

Exit mobile version