టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈరోజుతో ఆయనకు 42 ఏళ్లు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. ఆయన తండ్రి సినీ నిర్మాత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు, తల్లి శివ కుమారి. ప్రభాస్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రభాస్ కుటుంబానిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మొగల్తూరు. తన పెదనాన్న కృష్ణంరాజు బాటలో నటుడిగా పయనించాలని నిర్ణయించుకుని సినిమా ఇండస్ట్రీలోకి 2002లో ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ మూడవ చిత్రం ‘వర్షం’తో హిట్ కొట్టాడు. ఇక ఆ తరువాత సినిమా సినిమాకూ ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఛత్రపతి, మిర్చి, బాహుబలి వంటి సిరీస్ లతో నేడు మనముందు పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభాస్ కు సినీ ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు
